Follow my blog with Bloglovin India News Buzz: ప్రభాస్ కరియర్ లోనే మొదటి ప్రకటన

Tuesday, 29 September 2015

ప్రభాస్ కరియర్ లోనే మొదటి ప్రకటన



బాహుబలి షూటింగ్ అయిందో లేదో ఓ వైపు ప్రమోషన్స్.. ఇంటర్వ్యూలు చూసుకుంటూనే మహింద్రా వారిచ్చిన ఆడ్ షూట్ కి కూడా సాయి అన్నాడు. ఈ బాహుబలికి కారు షూటింగ్ లో కూడా గోడలు బద్దలు కొట్టక తప్పలేదు.. అదేంటో దానికి ఒక సొట్ట కూడా పడలేదు, పక్కన అంత పెద్ద లారీ తగలబడుతుంటే ఆ మంటల్లోంచి వచ్చినా ఇంజిన్ పేలలేదు...ఆడ్ డైరెక్టర్ టెక్నాలజీ వాడాడా..? లేకపోతే మహేంద్రా వాళ్ళే ఈ కొత్త టెక్నాలజీతో వెహికిల్ తయారు చేశారా..? అన్నట్టుంది వీడియో మాత్రం. 


కాకపోతే ప్రభాస్ మహీంద్రా వారి ఆడ్ లో చాలా కొత్తగా ఉన్నాడు. దాదాపు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మహీంద్రా వారి ఆడ్ కి కూడా సోషల్ నెట్ వర్క్ లలో పబ్లిసిటీ మీద పబ్లిసిటీ చేసేస్తున్నారు.. కొంచెం కొత్తగా ఉన్నా వింతగా ఏమీ లేదు లెండి. డార్లింగ్ కదా.. ఆడ్ లో చేస్తే మాత్రం వదులుకుంటారా ఏంటి...?

No comments:

Post a Comment