సాధారణంగా రాజమౌళి సినిమా తరవాత ఏ హీరోకైనా ఇండస్ట్రీలో
నిలదొక్కుకోవాలంటే కాస్త టైం పడుతుంది. రాజమౌళి సినిమా తరవాత ఆ పర్టికులర్ హీరో
పట్ల అభిమానుల్లో అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. అలాంటిది రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్
లో పని చేసిన ప్రభాస్ పరిస్థితి ఏంటి..? అసలు ఆ తరవాత సినిమా ఏంటి..?
బాహుబలి సినిమాని తలదన్నే సినిమా టాలీవుడ్ లో
మళ్ళీ తెర కెక్కుతుందా..? ఆ అవకాశం ప్రభాస్ కే వస్తుందా...? పెద్దగా ఎవరూ
పట్టించుకోవడం లేదు కానీ... బాహుబలి ఎంత పెద్ద హిట్టో.. అంతే గట్టి ఉచ్చు ప్రభాస్
కరియర్ కీ బిగుసుకుంటుంది. అలా అంటే మన డార్లింగ్ వెనక్కి తగ్గే రకమో, భయపడే రకమో
అని కాదు.. కాకపోతే కాస్త టైం మాత్రం తప్పక పడుతుంది.
No comments:
Post a Comment