Follow my blog with Bloglovin India News Buzz: lady Bruce lee by Rgv will beat Ram charan

Sunday, 4 October 2015

lady Bruce lee by Rgv will beat Ram charan



ఏంటో రామ్ గోపాల్ వర్మ ఓ పట్టాన అర్థం కాడు... బాహుబలి రిలీజ్ అయిందో లేదో.. ఒక సినిమా హిట్టయింది కథ ఉండాలి స్టార్ లు అవసరం లేదు అని నిరూపించిన సినిమా అంటాడు. మహేష్ శ్రీమంతుడు రిలీజ్ కాగానే ఆయన  నవ్వు చాలు బాక్సాఫీస్ బద్దలు కావడానికి అంటాడు...

శుభమా అని రాం చరణ్ బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్  చేసుకుని రిలీజ్ డేట్ ప్రకటిస్తే చల్లగా తను కూడా బ్రూస్ లీ టైటిల్ తో ట్రేలర్ రిలీజ్ చేసేశాడు. ఏంటిది..? అడిగితే ఇంకేమైనా ఉందా..? యే బ్రూస్ లీ వాళ్ళకే సొంతమా..? ఆయన ఇంటర్నేషనల్ స్టార్... ఆయన పేరును ఎవడైనా వాడేసుకోవచ్చు అంటాడేమో... ఆ ఏముందిలే... మొన్నామధ్య శ్రీదేవి అని ఓ సారి, సావిత్రి అని ఓ సారి పోస్టర్లు రిలీజ్ చేశాడు ఏమైంది...? మహా అయితే మీడియాలో ఓ రెండ్రోజులు న్యూస్ వచ్చింది. ఇది కూడా అంతే.. జనాల మైండ్ సెట్ తో ఆడుకోవడమంటే ఆయనకో సరదా... 

కానీ  రాం చరణ్ బ్రూస్ లీ సంగతి కాసేపు పక్కన పెడితే RGV లేడీ బ్రూస్ లీ మాత్రం కళ్ళు తిప్పనివ్వడం లేదు.. ట్రేలరే ఈ రేంజ్ లో ఉందంటే సినిమా సంగతి తలుచుకుంటేనే బ్రూస్ లీ కనిపిస్తున్నాడు. 

ఇక విషయానికి వస్తే బ్రూస్ లీ టైటిల్ మొదటి నుండే చిన్న చిన్న వివాదాల్లో ఉంది. తమిళ్ లో కొద్ది కాలం క్రితమే రిలీజ్ అయింది ఒక బ్రూస్ లీ, కాబట్టి తమిల్ లో బ్రూస్ లీ 2 గా రిలీజ్ చేస్తున్నారు. ఎలాగోలా సెట్ అయింది అనుకుంటే ఇప్పుడు సడెన్ గా RGV ఊడి పడ్డాడు. సరే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మైండ్ వెయిట్ పెంచుకుందామా అంటే ఏమో... రేపో మాపో... బ్రూస్ లీ టైటిల్ ని నేనెప్పుడో డిసైడ్ చేసుకున్నాను, రాం చరణ్ బ్రూస్ లీ కూడా  ఉంది కాబట్టి పేరు మార్చేద్దాం అని చల్లగా చెప్పినా చెప్తాడు రాం గోపాల్ వర్మ. కాబట్టి డియర్ రాం చరణ్ ఫ్యాన్స్.. బి. పి. పెంచుకోకండే... ఈ సారి సై లెంట్ గా కానిచ్చేయండి...ఏం జరుగుతుందో కాస్త ఓపిగ్గా వేచి చూద్దాం. 

No comments:

Post a Comment